Kadapa: సిలిండర్ పేలి దంపతులకు తీవ్ర గాయాలు

వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడులో సాత్రి జేమ్స్, మరియమ్మ దంపతుల ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది...

Update: 2023-05-13 14:41 GMT

దిశ, కడప: వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడులో సాత్రి జేమ్స్, మరియమ్మ దంపతుల ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు ఆరు బయట నిద్రిస్తుండగా ఇంట్లో పెద్ద శబ్ధం రాగా లోపలికి వెళ్లి లైట్ వేసి చూడగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే వారికీ అంటుకున్నాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News