Viveka Case: వివేకా లేఖపై సీబీఐ కీలక నిర్ణయం

వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య స్పాట్‌లో దొరికిన లేఖ ద్వారా ఆధారాలు సేకరించేందుకు సీబీఐ దూకుడు పెంచింది.

Update: 2023-05-12 10:47 GMT

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య స్పాట్‌లో దొరికిన లేఖ ద్వారా ఆధారాలు సేకరించేందుకు సీబీఐ దూకుడు పెంచింది. లేఖపై ఉన్న వేలిముద్రలను గుర్తించేందుకు కసరత్తు చేసింది. ఈ మేరకు వివేకా లేఖను నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనుమనితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, ఇందుకోసం లేఖపై నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని కోరింది. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులు కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ పిటిషన్‌‌ను కోర్టు స్వీకరించింది. నిందితుల స్పందన కావాలని సూచించింది. అలాగే జూన్ 3న విచారిస్తామని వెల్లడించింది.

కాగా ఈ కేసు విచారణలో భాగంగా వివేకా లేఖను 2021 ఫిబ్రవరి 11న సీఎఫ్‌ఎస్ఎల్‌కు సీబీఐ పంపింది. వైఎస్ వివేకానందారెడ్డి తీవ్ర ఒత్తిడిలోనే లేఖ రాసినట్లు సీఎఫ్‌ఎస్ఎల్‌ తేల్చింది. అయితే లేఖపై ఉన్న వేలిముద్రలను కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్‌ను సీబీఐ కోరింది. లేఖపై వేలముద్రలు గుర్తించేందుకు నిన్ హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్ఎస్ఎల్‌ స్పష్టం చేసింది. నిన్ హైడ్రేట్ పరీక్షతో లేఖపై ఉన్న రాత ఇంకు దెబ్బతింటుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Supreme Court: కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు  

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News