జగనన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ షర్మిల..కారణం ఏంటంటే?

ఏపీలో ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే. ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల రాజకీయం రసవత్తరంగా మారాయి.

Update: 2024-05-10 13:40 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే. ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల రాజకీయం రసవత్తరంగా మారాయి. వైఎస్ షర్మిల సీఎం జగన్‌కి సొంత చెల్లె అయినప్పటికి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై మరొకరు విమర్శలు వర్షం కురిపిస్తారు. సీఎం జగన్ ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబ విషయాలపై మాట్లాడరు. ఈ క్రమంలో షర్మిలతో గొడవ విషయమై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కడపలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ సవాల్‌ విసిరారు. రాజకీయ కాంక్షతో తాను INCలో చేరానని జగన్‌ చెప్పడాన్ని తప్పుబట్టారు. జగన్‌ అరెస్ట్‌ అయినప్పుడు తనను ప్రచారం చేయాలని కోరింది జగన్‌ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, 2019 ఎన్నికల్లో 'బై బై బాబు' ప్రచారం చేసింది నేను కాదా? అని నిలదీశారు. 'నాకు రాజకీయ కాంక్ష ఉంటే వైసీపీని హైజాక్ చేసేదాన్ని కాదా' అని పేర్కొన్నారు. 'నా పిల్లలు, కుటుంబాన్ని వదిలేసి రోడ్లపై జగన్‌ కోసం తిరిగింది నేను కాదా? జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించింది నేను కాదా? ప్రశ్నించారు. సోషల్ మీడియాలో నాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Read More..

AP:ఫ్యాన్‌కి ఓటేస్తే మీ మెడకు ఉరేసినట్లే..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News