విద్యారంగంలో సంస్కరణలు సత్ఫలితాలు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

విద్యారంగంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-05-07 16:14 GMT

దిశ, ఏపీ బ్యూరో: విద్యారంగంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అందుకు ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 72.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఇది గతేడాది కంటే 5% శాతం పెరుగుదల సాధించిందన్నారు. కాగా ఈ పరీక్ష ఫలితాల్లో మొదటి స్థానంలో మన్యం జిల్లా నిలిచిందన్నారు.

వర్షాల సమయంలో అన్నదాతకు అండగా జగన్ ప్రభుత్వం కష్టపడి పండించిన పంట చేతికొస్తున్న సమయంలో అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని చెప్పాడు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రచారానికి దురంగా ఉంటూ ధాన్యం సేకరణకు ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అందుకోసం జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించిందని చెప్పారు.

Tags:    

Similar News