వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్ అయినట్లు సమాచారం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్

Update: 2024-05-22 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్ అయినట్లు సమాచారం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌజ్‌లో ఎమ్మెల్యేను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన ఇష్యూలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎమ్మెల్యే కోసం పోలీసులు ఉదయం నుండి విస్తృతంగా గాలిస్తున్నారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఎమ్మెల్యేపై లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అరెస్ట్‌పై పోలీసులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Similar News