కడపలో వైసీపీకి భారీ షాక్.. మైనార్టీకి చెందిన కీలక నేత రాజీనామా

కడపలో వైసీపీకి భారీ షాక్ తగిలింది....

Update: 2024-04-08 16:15 GMT

దిశ, వెబ్ డెస్క్: కడపలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కార్యదర్శి అఫ్జల్‌ఖాన్ రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపారు. కడప సీటుపై ఆశలు పెట్టుకున్న ఆయనకు సీఎం జగన్ విడుదల చేసిన జాబితాలో నిరాశ కలిగింది. దీంతో మనస్థాపం చెందిన అఫ్జల్‌ఖాన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విషయం అధిష్టానం తెలిసినా ఎలాంటి సంప్రదింపులు, క్లారిటీ లేకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. కడప ఎమ్మెల్యే సీటు ఇస్తానని సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని అఫ్జల్‌ఖాన్ తెలిపారు.

Tags:    

Similar News