ఈ అక్కా చెల్లెళ్ల ప్రతిభ చూస్తే షాకే...

పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు.. ఆడ, మగ అనే సంబంధం లేకుండా ప్రతిభ చూపించవచ్చు. ..Shocking to see the Talent of these Sisters...

Update: 2022-11-08 17:02 GMT

దిశ వెబ్ డెస్క్: పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు.. ఆడ, మగ అనే సంబంధం లేకుండా ప్రతిభ చూపించవచ్చు. అంతేకాదు అసాధారణ పోటీల్లో సైతం రాణించవచ్చు. అలా ఇద్దరు అక్కా చెల్లెళ్లు కరాటే (Karate) పోటీల్లో దూసుకుపోతున్నారు. దెబ్బలు తగులుతాయనే భయం ఏ మాత్రంలేకుండా పోటీల్లో తలపడి పతకాలు సాధిస్తున్నారు.

విజయనగరం (Vizianagaram) జిల్లా భామిని మండలానికి చెందిన కూర్మాపు నమ్రత (Kurmapu Namrata), తన్మయి(Tanmai) ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. అక్క నమత్ర ఇంటర్ (Inter) చదువుతోంది. చెల్లెలు తన్మయి తొమ్మిదో తరగతి చదువుతోంది. వీళ్లకు కరాటే అంటే ఇష్టం. దీంతో ఇద్దరు కూడా కరాటే నేర్చుకున్నారు. ఎక్కడి పోటీలు జరిగినా పాల్గొంటూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో నమ్రత బ్రాంజ్ మెడల్ (Broze Medal)సాధించి మూడో స్థానంలో నిలవగా.. చెల్లెలు సిల్వర్ (Silver) పతకం సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇటీవల విజయవాడలో జరిగిన జూజిత్స్ పోటీల్లోనూ వీళ్లిద్దరు గోల్డ్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు, చెల్లెలు తన్మయి ఇప్పటివరకూ 8 సార్లు పతకాలు సాధించారు. ఈ అక్కాచెల్లెళ్లకు తండ్రి భవానీనే కరాటే శిక్షణ ఇస్తున్నారు. హిర మండలానికి చెందిన కరాటే గురువు సింహాచలం ఆధ్వర్యంలో నమ్రత, తన్మయి.. కరాటే పోటీల్లో పాల్గొంటున్నారు.

Similar News