Anakapalli CITU: సీఎం సార్.. అంగన్వాడీల హామీలేమయ్యాయి?

రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీని సీఐటీయూ అనకాపల్లి ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు అమలు చేయలేదన్నారు. ..

Update: 2023-02-06 13:21 GMT

దిశ, అనకాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వావాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయలేదని సీఐటీయూ అనకాపల్లి ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయు అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కన్నా ఒక వెయ్యి రూపాయలు అదనంగా జీతం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నేడు తెలంగాణ కన్నా తక్కువ వేతనాలతో అంగన్‌న్వాడీ కార్యకర్తలు ఉన్నారని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త యాపులతో అంగన్వాడీలపై పని భారం పెంచారని కోటేశ్వరరావు మండిపడ్డారు. పనికిరాని సెల్ ఫోన్లు ఇచ్చి చాలా యాప్‌లు డౌన్లోడ్ చేసి పని చేయాలని  అంగన్వాడీలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూకి ఇచ్చే అరకొర డబ్బులతో పంచభక్ష పరమాన్నాలు పెట్టాలని చెబుతున్నారని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డబ్బులు సరిపోవటం లేదని తెలిపారు. మారావైపు ఫుడ్ కమిటీ చైర్మన్ అంగన్వాడీలను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, నాణ్యమైన సరుకులు ఇవ్వని అధికారులుపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. నెలల తరబడి బిల్లులు, జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోటేశ్వరరావు కోరారు.

Similar News