Anil Ambani: ఏపీపై ఫోకస్.. సోలార్‌ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు

భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ అన్నారు..

Update: 2023-03-03 15:30 GMT

దిశ, ఉత్తరాంధ్ర: భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ అన్నారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ అడ్వాంటేజ్‌ ఏపీలో నిజంగానే అద్భుతమైన టాలెంట్‌, మానవ వనరులు చాలా ఉన్నాయన్నారు. గోదావరి-కృష్ణ నదీతీరం, విజయనగర సామ్రాజ్య వైభవం అన్నీ ఏపీకి సొంతమని కొనియాడారు. ఏపీలో మౌళిక సదుపాయాలు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఏపీ నుంచి అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు చాలా మంది ఉన్నారన్నారు. రిలయన్స్‌లో కీలకమైన అధికారులు కూడా ఏపీ నుంచే ఉన్నారని గుర్తు చేశారు. భారతదేశానికి ఏపీ చాలా కీలకంగా ఉందన్నారు. ఏపీ సుదీర్ఘమైన కోస్తాతీరం కలిగి ఉందని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లుగా నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని అంబానీ ప్రశంసించారు. 

ఇప్పటికే ఏపీ కేజీ బేసిన్‌లో 150 వేల కోట్ల పెట్టుబడులు రిలయన్స్‌వి కొనసాగుతున్నాయని, ఏపీలో జియో నెట్‌వర్క్‌ అభివృద్ధి శరవేగంగా ఉందని తెలిపారు. రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా రాష్ట్రంలోని 6 వేల గ్రామాలతో అనుసంధానం కలిగి ఉందని చెప్పారు. త్వరలో ఏపీలో రెన్యూవబుల్‌ సోలార్‌ ఎనర్జీ రంగంలో 10 గిగావాట్స్‌ సామర్ధ్యం కలిగిన పరిశ్రమను నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో 5జీ నెట్‌వర్క్‌ 90శాతం కవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకూ పెట్టినట్టే ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు కొనసాగుతాయని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని అనిల్ అంబానీ పేర్కొన్నారు.

Tags:    

Similar News