ఇది వరకు ఏదో మొక్కుబడి.. ఇప్పుడు చాలా గొప్ప: Vijaysaireddy

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇది వరకు ఏదో మొక్కుబడిగా జరిపే కార్యక్రమమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ..

Update: 2023-03-08 15:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇది వరకు ఏదో మొక్కుబడిగా జరిపే కార్యక్రమమని, కానీ ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు మాత్రం  తాము సాధించిన ప్రగతిని గుర్తు చేసుకునే గొప్ప సందర్భమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తెలుగు మహిళలు, ప్రపంచ స్త్రీలు, భారత సోదరీమణుల ప్రగతిపథంలో వేగంగా ముందుకు పరిగెడుతున్నారని తెలిపారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయంతో 1977 నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం మొదలైందని చెప్పారు. వేలాది ఏళ్ల నుంచి స్త్రీలకు సమాన గౌరవం ఇవ్వాలనే భావనలు ఉన్న భారతదేశంలో కూడా ఆడపడుచుల అభివృద్ధికి, సాధికారతకు ఉన్న ప్రాధాన్యం గురించి గుర్తుచేసుకోవడం ఆరంభమైందని విజయసాయిరెడ్డి తెలిపారు.

తెలుగునాట స్త్రీలు చిన్న చిన్న అవసరాలకు బయటకు పరుగులు తీసే అవసరం లేకుండా గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థలు అండగా నిలుస్తున్నాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మహిళా పోలీసు వ్యవస్థ, దిశా చట్టం, దిశా యాప్‌ ఆడపడుచుల భద్రతకు అన్ని గ్రామాల్లో రక్షణ కవచంలా పని చేస్తున్నాయని, 2004–2009 మధ్య దివంగత రాజశేఖరరెడ్డిని అఖిలాంధ్ర మహిళాలోకం అన్నగా ప్రవేశపెట్టిన చాలా పథకాలకు అదనంగా 2019 మే ఆఖరు నుంచి వైఎస్సార్సీపీ సర్కారు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు మున్నెన్నడూ లేని స్థాయిలో మహిళల సర్వతోముఖాభివృద్ధిగా దోహదం చేస్తున్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News