తన స్వలాభామా ..? లేక రాష్ట్ర సౌలభ్యమా..? జగన్ ఏం కోరుకుంటున్నారు..?
టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు అమరావతి లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చాలచాల మోడస్ ఒపేరండి (modus operandi ) ఎంవో అంటే కొత్త విధానాలను తీసుకు వచ్చారు అని పేర్కొన్నారు. అయితే అవి రాష్ట్ర ఖజానాను నింపడానికి కాదని.. ప్రజలకు ఉపయోగపడడానికి కాదని.. జగన్ సొంత ఖజానా కోసం.. జగన్ జోబులు నింపుకోవడం కోసం తీసుకు వచ్చారని ఆరోపించారు.
అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త కొత్త చట్టాలను తీసుకువస్తున్నారని పేర్కొన్న ఆయన.. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అని తెలిపారు. అయితే అందరు టాక్స్ అలానే GST కరెక్ట్ గా కడుతున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు కేద్రప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోమని సూచించిందని తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆసరాగా తీసుకుని తన సొంత ఖజానా నింపుకున్నారని ఆరోపించారు.
ఇక ఇక్కడ అధికారులు ఎవరు పనికిరానట్టు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో పని చేసే తన బంధువు రాజేశ్వర్ రెడ్డి ని తీసుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ లో స్పెషల్ కమిషనర్ గా నియమించారని వెల్లడించారు. రేపిటేషన్ పై వచ్చిన వారిని గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి కీల పదవుల్లో నియమించలేదని.. కానీ జగన్ తన స్వార్ధం, కోసం రాజేశ్వర్ రెడ్డిని రేపిటేషన్ పై నియమించారని.. రేపిటేషన్ పై ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండరని మంది పడ్డారు.
ఇక జగన్ కు వ్యతిరేకంగా ఉండే, నేతలకు, పారిశ్రామికవేత్తలకు GST కట్టలేదనో, పన్నులు సక్రమంగా చెల్లించలేదనో రాజేశ్వర్ రెడ్డి నోటీసులు పంపి వాళ్ళ నుండి డబ్బులు గుంజి ఆ నగదును జగన్ రెడ్డి ఖజానాకు పంపుతారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.