పవన్ కళ్యాణ్‌కు వచ్చే ఓట్లు ఇవే..వంగా గీత షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఏపీలో 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ మే 13వ తేదీన ముగిసిన తెలిసిందే. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో గెలపు ఓటములపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-05-22 10:00 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ మే 13వ తేదీన ముగిసిన తెలిసిందే. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో గెలపు ఓటములపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ప్రధాన పార్టీలన్నీ తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో అనే విషయం జూన్ 4వ తేదీన తెలుస్తుంది.

ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం హాట్ టాపిక్‌గా మారింది.పవన్ కళ్యాణ్ గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి ఎన్నికల్లో పవన్ గెలుపుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని, ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత పోటీ చేశారు.

పవన్ గెలుపుపై వంగా గీత మాట్లాడిన ఒక ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గురించి వంగా గీత ఆడియోలో పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ అని, ఒక పార్టీ ప్రెసిడెంట్ అని చెబుతూ, ఆయన కోసం అందరూ వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు అని చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల్లో 80,000 నుంచి 90,000 ఓట్లు వచ్చే అవకాశం ఉందని తన అంచనాగా చెప్పారు. వంగా గీత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారింది.

Similar News