జనసేన నాయకుడి కారుకు నిప్పు..తృటిలో తప్పిన భారీ ప్రమాదం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అరాచకం సృష్టించారు....

Update: 2024-05-27 11:41 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుల ఇళ్ల వద్ద నానా బీభత్సం సృష్టించారు. కర్రి మహేశ్ అనే జనసేన నాయకుడి ఇంటి ముందు హల్ చల్ చేశారు. మహేశ్ ఇంటి ప్రాంగణంలో ఉన్న కారుకు నిప్పు పెట్టారు. దీంతో అర్ధరాత్రి ఇంటి ముందు మంటలు చెలరేగడంతో కర్రిమహేశ్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు కారు నుంచి మంటలు భారీగా చెలరేగాయి. వంట ఇంటి గోడ వైపు మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అయితే ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా దగ్ధం అయింది. దీంతో జనసేన నాయకుడు కర్రి మహేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంటలు వంట ఇంట్లోకి వ్యాపించి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని వాపోయారు. జనసేన తరపున ఉన్నందునే కావాలనే ప్రత్యర్థులు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో కేసును ఛేదిస్తామని చెప్పారు. 

Read More...

Breaking: యాసిడ్, గ్యాస్ లోడ్ లారీలు ఢీ.. భయం..భయం 

Similar News