రాజ్యసభలో 11కు 11 వైసీపీ ఎంపీలే.. వివరాలు ఇవే..!

వైసీపీ ముగ్గురు రాజసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...

Update: 2024-02-17 16:25 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ముగ్గురు రాజసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో మొత్తం 11 స్థానాల్లో వైసీపీ సభ్యులే ఉన్నారు. ఇటీవల ఖాళీ అయిన మూడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడా రఘునాథరెడ్డిను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.


అయితే టీడీపీ పోటీకి దిగకపోవడంతో ఆ మూడు స్థానాలను వైసీపీనే కైవసం చేసుకుంది. దీంతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం 11కు చేరింది. ఇక కొత్తగా ఎన్నికైన వైసీపీ సభ్యులు ఏప్రిల్ 2030 వరకు ప్రాతినిధ్యం వహించనున్నారు. మిగిలిన సభ్యులు విజయసాయిరెడ్డి, ఆర్. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు జూన్ 2028 వరకు పదవీ కాలం ఉంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని పదవీకాలం జూన్ 2026 వరకు ఉంది. కాగా రాజ్యసభలో టీడీపీ అభ్యర్థులు లేకపోవడంతో ఆ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది. 

Tags:    

Similar News