సీఎం జగన్ మంగళవారం షెడ్యూల్ ఇదే..!

మంగళవారం ఉదయం 9 గంటలకు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించనున్నారు....

Update: 2024-04-22 17:34 GMT

దిశ, వెబ్ డెస్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఎక్కడ రోడ్ షో నిర్వహించినా ప్రజలు పోటెత్తుతున్నారు. విశాఖలో సోమవారం పర్యటించిన సీఎం జగన్ ఈ రాత్రి ఎండాడ ఎంవీవీ సిటీలో బస చేయనున్నారు. ఈ బస కేంద్రం నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించనున్నారు. ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి మధురవాడ మీదుగా అనందపురం నుంచి తగరపువలస, జొన్నాడలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత చింతవలస, పూటపాటి రేగ, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు. అనంతరం అక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత గురువారం అక్కివలస నుంచి బస్సు యాత్రను కొనసాగించనున్నారు. 

Similar News