ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పరిస్థితి ఇదేనంటూ బాంబ్ పేల్చిన వేణు స్వామి.. పార్టీనే ఉండదంటూ కామెంట్స్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై పలు కామెంట్స్ చేసి సంచలనం సృష్టిస్తుంటాడు.

Update: 2024-05-26 07:47 GMT

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై పలు కామెంట్స్ చేసి సంచలనం సృష్టిస్తుంటాడు. అంతేకాకుండా సంసారాలు, వైవాహిక జీవితాలు పెటాకులు అవడం వంటివి చెబుతూ అందరిని షాక్‌కు గురి చేస్తుంటాడు. అయితే సినిమా హిట్ అవుతాయా లేదా అనేది కూడా చెబుతుంటాడు. అలాగే కొంత మంది హీరోయిన్స్‌కు పరిహార పూజలు కూడా చేశాడు వేణు స్వామి. అయితే ఇటీవల కొన్ని నిజం కాకపోవడంతో అంతా ఆయనను ట్రోల్స్ చేశారు. అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా వేణు స్వామి పలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ నేను ప్రజల నాడిని చూసి చెప్పను. వ్యక్తుల జాతకాలను బట్టి నా విశ్లేషణ ఉంటుంది. రాజకీయ, సామాజిక పరిస్థితులను బేరీజు వేసి చెబితే అది జోస్యం అవుతుంది. వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ జాతకాలు నా దగ్గర ఉన్నాయి. అయితే జగన్ జాతకం ప్రకారం వైఎస్ జగన్‌ను తిరుగు ఉండదు. చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు. కాబట్టి ఆయనకు ఎలాంటి రాజయోగం లేదు. పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి రాలేడు. సినిమాలు చేసుకోవడం మంచిది. అలాగే పిఠాపురంలో గెలవడం కష్టమే. ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ఈ విషయం తెలిసిన వారు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఉండదా ఏంటి అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Similar News