Thirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

కలియుగం దైవం తిరుమల వెంకటేశ్వరుడి ఆలయానికి ఇవాళ భక్తుల తాకిడి పెరిగింది.

Update: 2024-01-19 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలియుగం దైవం తిరుమల వెంకటేశ్వరుడి ఆలయానికి ఇవాళ భక్తుల తాకిడి పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నవారు తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న స్వామి వారిని 62,649 భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,384 మంది భక్తులు తలనీలాలను ఇచ్చి మొక్కిన మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇవాళ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనం కోసం సుమారు 19 గంటల సమయం పడుతోంది.

Read More..

550 ఏళ్ల కల అయోధ్య రామాలయం.. అది చరిత్రలో నిలిచిపోయే రోజు..నరసింహారావు  

Tags:    

Similar News