ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు

దిశ, వెబ్‌డెస్క్: ఆలయాల్లో చోరీలకు పాల్పడే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2022-08-13 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆలయాల్లో చోరీలకు పాల్పడే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.వారి వద్ద నుండి సిల్వర్, బంగారం, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజయవాడలోని సీపీఎస్ పోలీసు స్టేషనులో డిఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మే, జూన్, జూలై నెలల్లో గజపతి నగర్, కోమటిపల్లి, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం, విజయనగరం పట్టణంలోని దండుమారమ్మ ఆలయాల్లో దొంగతనాలు జరిగాయన్నారు, ఆలయాల్లోని వెండి, బంగారు ఆభరణాలను దొంగలు దోచుకొని పోగా, ఆయా పోలీసు స్టేషను పరిధిలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇద్దురు వ్యక్తులు మద్యం, వ్యభిచారం, క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు డబ్బు కోసం శిఖ ఆనంద్ అలియాస్ ఆడం (29) మరో వ్యక్తి గజపతి నగరం షరాబుల కాలనీకి చెందిన పొన్నాడ కిరణ్‌లు (28 ) దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

Similar News