గురువుకి లక్షలు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు.. వావ్ అంటున్న నెటిజెన్స్

ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడు కీలకపాత్ర పోషిస్తాడు

Update: 2024-04-29 07:56 GMT

దిశ, ఫీచర్స్: ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడు కీలకపాత్ర పోషిస్తాడు. ఉపాధ్యాయులు కూడా కేవలం బోధనతోనే బాధ్యత నెరవేరుతుందని భావించకుండా జీవిత పాఠాలు బోధిస్తారు. అలాంటి గురువుకి ఎన్ని బహుమతులు ఇచ్చినా తప్పు లేదు. ఇక్కడ విద్యార్థులు వల్ల ఊహించని బహుమతి ఇచ్చి షాక్ అయ్యేలా చేసారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు ఏకంగా లక్షలు విలువ చేసే కారును బహుమతిగా ఇచ్చారు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో పనిచేసే ఉపాధ్యాయుడు. గతంలో అనంతపురం జిల్లా లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లాలోని నవోదయలో బోధించిన ఆయన 2016 నుంచి మద్దిరాల నవోదయలో బోధన చేస్తూ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.

ఆదివారం మద్దిరాల నవోదయలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మధ్యలో కారును డెలివరీ చేసి జేమ్స్ దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు, ఇతర ఉపాధ్యాయులు, లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు జేమ్స్ దంపతులను సన్మానించారు. టీచర్ కు బహుమతిగా ఇచ్చిన కారు విలువ అక్షరాల రూ.12 లక్షలు.

Similar News