AP News:ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన సిగ్గుమాలిన చర్య..ఈసీ సీరియస్

పోలింగ్ రోజు మాచర్లలో ఏడు ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఘటనలన్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారని ఈసీ తెలిపింది.

Update: 2024-05-23 06:45 GMT

దిశ,వెబ్‌డెస్క్: పోలింగ్ రోజు మాచర్లలో ఏడు ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఘటనలన్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారని ఈసీ తెలిపింది. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉంది. డేటా భద్రంగా ఉండడం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించినట్లు తెలిపారు. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించారని పేర్కొన్నారు. సిట్ కు పోలీసులు అన్ని వివరాలు అందించారు. 20వ తేదీన రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని ఎస్ఐ పేర్కొన్నారు.

ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొంది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ గుర్తించింది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A1గా చేర్చినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం పది సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామన్నారు. ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. నిన్నటి నుంచి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Similar News