AP Politics: నరరూప రాక్షసలు పిన్నెల్లి సోదరులు.. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్

గత నాలుగు రోజులగా పిన్నెల్లి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది.

Update: 2024-05-25 06:38 GMT

దిశ వెబ్ డెస్క్: గత నాలుగు రోజులగా పిన్నెల్లి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఈవియంలను పగలగొట్టి, నియోజకవర్గంలో అల్లర్లకు కారణమైయ్యారని ఆయనపై కేసు నమోదు చేయగా ఆయన పరారైన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ జాతియ ప్రధాన కార్యధర్శి నారా లోకేష్ పిన్నెల్లి సోదరులపై X వేదికగా మండిపడ్డారు.

నరరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులని దుయ్యబట్టారు. మాచర్ల నియోజకవర్గంలో 20 ఏళ్లుగా మారణ హోమం సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరమణారెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నారనే కారణంతో ఊర్లకు ఊర్లు తగలబెడుతూ, కుటుంబాలను మట్టు పెడుతోన్న పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

Similar News