తల్లిని, చెల్లిని గెంటేసినోడికి పరువేంటి?: లోకేశ్‌కు నోటీసులివ్వడంపై Devineni Uma Maheswara Rao

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2023-08-24 06:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. నారా లోకేశ్ ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. అసలు వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదని చెప్పుకొచ్చారు. అయినా తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తికి పరువు ఉంటుందా అని ప్రశ్నించారు. సొంత బాబాయ్‌ని హత్య చేయించిన వాడికి పరువు ఉంటుందా? అని కడిగిపారేశారు. అవినీతి సొమ్మును కాపాడుకునేందుకు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలు జగన్ బూట్లను నాకేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమకంటే వైసీపీ నేతలు, మంత్రులు అసభ్యకరంగా మాట్లాడారని అవన్నీ తమకు, రాష్ట్ర ప్రజలకు గుర్తేనని చెప్పుకొచ్చారు. తమపై వైసీపీ నేతల ప్రతి బూతు మాటకు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెపుతారని దేవినేని ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు.

Tags:    

Similar News