‘చంద్రబాబు, లోకేష్‌ ఒకేరోజు బాధ్యతలు చేపట్టాలి’

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-24 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని కాపాడే శక్తి నారా లోకేష్ ఉందని అన్నారు. వెంటనే లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా, లోకేష్‌ పార్టీ చీఫ్‌గా ఒకేరోజు బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఆ వర్గం, ఈ వర్గం అంటూ తేడా లేదని అన్ని వర్గాలు లోకేష్‌కు అండగా ఉంటాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్ని వర్గాలూ మద్దతిస్తాయని తెలిపారు. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి 130కిపైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆత్మకథ రాస్తే అందులో తనకు కూడా ఒక పేజీ కేటాయిస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా రక్తంతో చంద్రబాబు పాదాలు కడిగాను’ అని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కూడా సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. ప్రభుత్వంలో అచ్చెన్నాయుడిది కీలక పాత్ర ఉండబోతోంది కాబట్టి పార్టీ బాధ్యతలు లోకేష్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read More..

టీడీపీకి వచ్చే సీట్ల సంఖ్య ఇదే..వెరైటీగా జోస్యం చెప్పిన వైసీపీ ఎంపీ!!

Tags:    

Similar News