ఆ ప్రక్రియను వాయిదా వేయండి.. యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ

యూపీఎస్సీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు..

Update: 2024-05-24 11:25 GMT

దిశ, వెబ్ డెస్క్: యూపీఎస్సీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మెంట్‌ను వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తోందని, ఐఏఎస్‌కు రాష్ట్ర కేడర్ ఎంపిక సరికాదని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ కన్ఫర్మెంట్‌ ప్రక్రియను కొనసాగించాలని కోరారు. ఐఏఎస్‌కు కేడర్ ఎంపిక పారదర్శకంగా జరగలేదని, సీఎం జగన్ కార్యాలయంలోని వారికే పదోన్నతలు ఇచ్చారని తెలిపారు ఐఏఎస్ కేడర్ లిస్టును పున: పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 4న ఫలితాలు విడుదల అవుతాయని.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఐఏఎస్ కన్ఫర్మెంట్‌‌ను వాయిదా వేయాలని యూపీఎస్సీని లేఖలో చంద్రబాబు కోరారు.

Read More..

 బెంగళూరు రేవ్ పార్టీ ..టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్

Similar News