Joint Action: ప్రతి ఇంటికి ఆ రెండు పార్టీలు.. ఇక జగన్‌కు దబిడి దిబిడే..!

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు చెప్పారు. ....

Update: 2023-10-28 14:21 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ, జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం జగన్ సర్కార్‌పై ఉమ్మడి కర్యాచరణకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం నుంచి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా రెండు పార్టీల సమన్వయకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. వైసీపీ అక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లనున్నారు. ప్రతి గడపను తట్టి వివరించనున్నారు.


ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా రెండు పార్టీల సమన్వయకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశాల్లో గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలు, ఉద్యోగ ఉపాధిలో రాష్ట్ర యువతకు జగన్ చేసిన ద్రోహం, కరువ పరిస్థితులు, సంక్షేమం పేరుతో జగన్ చేస్తున్న ద్రోహం, ధరల బాదుడుతో ప్రజలపై పడుతున్న భారాలు, మధ్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి కల్తీ మద్యం అమ్మకాలతో రూ. లక్ష కోట్లు దోచుకోవడమే కాకుండా వేలాది మంది మహిళల మాంగళ్యాలు తెంచుతున్న వైనంపై గడప గడకూ వివరించేలా కార్యచరణ చేపట్టనున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Tags:    

Similar News