2024లో టీడీపీ-జనసేన అధికారంలోకి రావడం ఖాయం : కన్నా లక్ష్మీనారాయణ

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు.

Update: 2023-09-14 09:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. ఇది శుభ పరిణామం అని అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తాం అని పవన్ కల్యాణ్ ప్రకటించడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. గత కొన్ని నెలలుగా తాను ఇదే అంశాన్ని చెప్తున్నట్లు తెలిపారు. టీడీపీ-జనసేన కలిసి పని చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని తాను పదేపదే చెప్తున్నట్లు తెలిపారు. ఈ పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News