ఏపీ కేంద్రంగా మానవ అక్రమ రవాణా.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

ఏపీ కేంద్రంగా జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు...

Update: 2024-05-25 06:15 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేంద్రంగా మానవ అక్రమ రవాణా జరిగిన విషయం తెలిసిందే. ఉద్యోగాల పేరుతో రాష్ట్రానికి చెందిన 150 మందిని కాంబోడియా తరలించారు. అక్కడ వారు చైనా గ్యాంగ్ సైబర్ క్రైబర్ బాధితులుగా మారారు. విశాఖకు చెందని వ్యక్తి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో భారత ఎంబసీ అధికారులు భారతీయులను సురక్షితంగా రక్షించి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. విశాఖకు చెందిన పలువురు బాధితులు కూడా స్వగ్రామాలకు చేరారు.

దీంతో ఏపీ నుంచి మానవ అక్రమ రవాణా జరగడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగువారిని కాపాడాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 150 మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహయపడాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్రానికి చెందిన యువతకు అక్రమంగా కాంబోడియాకు తరలించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా తరలించమే కాకుండా వారిని సైబర్ క్రైమ్ ఉచ్చులోకి నెట్టారని మండిపడ్డారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News