Elphants, Tigers: పార్వతీపురం మన్యం జిల్లాలో టెన్షన్ టెన్షన్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు, పెద్ద పులల సంచారం అక్కడి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఓవైపు ఏనుగులు పంటలను నాశనం చేస్తు్న్నాయి...

Update: 2022-12-04 12:01 GMT

దిశ వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు, పెద్ద పులుల సంచారం అక్కడి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఓవైపు ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు పశువులను పెద్ద పులులు చంపి తింటున్నాయి. ఐదేళ్లుగా ఏనుగుల గుంపు, పులులు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి ఏనుగులు, పెద్ద పులలు తమ గ్రామాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Similar News