ఆ వ్యవస్థ విప్లవాత్మకం: Mp Adala

దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపే వ్యవస్థ గ్రామ సచివాలయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ..

Update: 2023-02-25 17:09 GMT

దిశ, నెల్లూరు: దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపే వ్యవస్థ గ్రామ సచివాలయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గ పరిధిలోని గొల్ల కందుకూరు, సజ్జాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన గృహసారధుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గతంలో తాను రూరల్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు, మంచినీటి వసతి, డ్రైన్లు తదితర సౌకర్యాలను కల్పించానని గుర్తు చేశారు. వివక్షతకు తావు లేకుండా అందర్నీ కలుపుకొని పోయామని పేర్కొన్నారు. అయితే ఇక్కడ 9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తించాడో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని కోరారు. ఆయన చేసిన సేవ కంటే వెనకేసిందే ఎక్కువ అని, వందల కోట్లకు పడగలెత్తాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News