Nellore District Venkatagiri లో ముదిరిన వర్గపోరు.. ఆనం కటౌట్‌ దగ్ధం

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వెంకటగిరి క్రాస్ రోడ్డు సెంటర్‌లో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కటౌట్‌ని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. ...

Update: 2023-01-29 11:27 GMT

దిశ, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వెంకటగిరి క్రాస్ రోడ్డు సెంటర్‌లో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కటౌట్‌ని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. వెంకటగిరి వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి రామ్ కూమార్ రెడ్డి వర్గీయులే ఈ పని చేసి ఉంటారని ఆనం వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ తీరుపై ఆనం ప్రశ్నించారు. దీంతో వెంకటగిరి ఇంచార్జిగా ఆనంను తప్పించి రామ్ కుమార్ రెడ్డికి ఆ స్థానాన్ని కేటాయించింది. దానికి కారణం రామ్‌కుమార్‌రెడ్డికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత పెరగడమే కారణంగా తెలుస్తోంది.

Tags:    

Similar News