ఎన్టీఆర్ సేవలను పార్టీకి వినియోగించుకుంటాం.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడంపై ఏపీ రాజకీయాల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా

Update: 2022-09-04 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడంపై ఏపీ రాజకీయాల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువని, ఆయన సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని చెప్పారు. చంద్రబాబుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఫ్యామిలీ పార్టీలకు దూరమని అధిష్థానమే చెప్పిందని వివరించారు. రాజకీయాలకు కొంతమందే చేయరని, అందరూ చేస్తారని అన్నారు. అందరూ సినిమా యాక్టర్లేనని, యాక్టర్లు కానివారు ఎవరని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Also Read : NTR - అమిత్ షా భేటీకి అసలు కారణం ఇది.. కిషన్ రెడ్డి క్లారిటీ

Similar News