లేడి గెటప్‌లో పవన్, లోకేష్, చంద్రబాబు.. రామ్ గోపాల్ వర్మ సంచలన పోస్ట్

ఎన్నికల వేళ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అములులోకి వచ్చినప్పటి నుంచి కాస్త సైలెంట్ అయిన వర్మ మరోసారి వివాదాస్పద పోస్ట్ చేశారు.

Update: 2024-05-02 12:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అములులోకి వచ్చినప్పటి నుంచి కాస్త సైలెంట్ అయిన వర్మ మరోసారి వివాదాస్పద పోస్ట్ చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమి కట్టిన జనసేన, టీడీపీని ఎల్లప్పుడు టార్గెట్ చేస్తూ.. వార్తల్లో నిలిచే వర్మ.. తాజాగా తన ట్విట్టర్ లో పవన్, లోకేష్, చంద్రబాబు లేడీ గెటప్ లో ఉన్న మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో వర్మపై జనసేన టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కాగా వర్మ పెట్టిన పోస్టులో(మార్ఫింగ్ ఫొటోలో) పవన్, లోకేష్, చంద్రబాబు చీర కట్టుకుని ఏదో అప్లికేషన్ పట్టుకుని నిలబడటం కనిపింది. అలాగే ఆ ఫొటోకు క్యాప్షన్ గా ఇందులో ఉన్నది ఎవరు అంటూ వర్మ ప్రశ్నించారు.  కాగా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వర్మ ఓటింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఇలాంటి అభ్యంతరకర పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచారు.

Read More..

  AP Politics:కొంగు చాచి అడుగుతున్నా..షర్మిల ఎమోషనల్ పోస్ట్! 

Tags:    

Similar News