ఏపీలో ముందస్తు ఎన్నికలపై MP రఘురామ సంచలన వ్యాఖ్యలు..

వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామరాజు ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-01-16 13:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామరాజు ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. ఈ ఏడాది జూలై, ఆగస్ట్ నెలల్లో ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పార్టీల బంధం బలపడకముందే జగన్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తమ పార్టీ నేతలు రోజురోజుకు దాడులు పెంచుతున్నారని అన్నారు. అభిమానులను పవన్‌కు దూరం చేయడం సాధ్యం కాని పని అని నీలి ఛానెల్స్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.

వైసీపీ పవన్‌ను ఒకే కులానికి పరిమితం చేసే కుట్ర చేస్తోందని రఘురామరాజు ఆరోపించారు. ఏపీలో బీఆర్ఎస్ ఒక కులాన్ని ప్రోత్సహిస్తుందని విషప్రచారం చేయవద్దన్నారు. ఇక కోడికత్తి కేసు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాలుగేళ్లుగా కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు బెయిల్ రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మర్డర్ చేసినవారికి వెంటనే బెయిల్ వస్తుందని.. అలాంటింది కోడికత్తి కేసు నిందితుడికి నాలుగు సంవత్సరాలుగా బెయిల్ రాకపోవడం దారుణమన్నారు. 

Tags:    

Similar News