కష్టకాలంలో అండగా నిలిచారు.. సీఎం జగన్‌కు నటుడు సత్యనారాయణ కృతజ్ఞతలు

Update: 2022-01-20 06:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయినప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం తరపున చేసిన సేవకు రుణపడి ఉంటానన్నారు. పరిపాలనలో నిత్యం బిజీగా ఉండే సీఎం జగన్ తనకు నేరుగా కాల్ చేసి మాట్లాడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారని, అలాగే ప్రభుత్వ సహకారం కూడా అందించారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉన్నతాధికారులు సైతం తన ఆరోగ్యంపై రోజూ ఆరా తీసేవారని, ఒక ఉన్నతాధికారి ఆస్పత్రికి వచ్చి వైద్య సేవల గురించి కూడా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.

అంతేకాదు వైద్యానికి అయ్యే ఖర్చును సైతం ప్రభుత్వమే భరించడం మాకు ఎంతో బలాన్నిచిన్నట్లయిందన్నారు. ఎంతో కష్టకాలంలో నాకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపించిన శ్రద్ధ చూస్తుంటే సినీ పరిశ్రమ పై ఆయనకున్న గౌరవం తెలియజేస్తుందన్నారు. జగన్ కు భవిష్యత్తులో అంతా మంచే జరగాలని ఆకాక్షింస్తున్నట్లు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తెలిపారు.



Tags:    

Similar News