పబ్లిక్‌గా చంద్రబాబును ఇంటర్వ్యూ అడిగిన RGV.. ఇవ్వకపోతే ఒప్పుకున్నట్లే అంటూ..!!

YS వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2023-04-26 04:39 GMT

దిశ, వెబ్ డెస్క్: YS వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అధికార, విపక్షాల మధ్య రోజూ మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ys వివేకానంద రెడ్డి హత్యపై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసుపై తన నిజం ఛానల్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతేగాక, TDP అధినేత చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.

''గౌరవ నీయులైన చంద్రబాబు గారు. నా నిజం ఛానల్లో గొడ్డలి బాబాయ్ విషయాలను ఏదో మా చేతనైనంత విశ్లేషించాము. కానీ, మీ పాయింట్లో మీరు ఎమ్ అనుకుంటున్నారో చెప్పటానికి నాకొక ఇంటర్వ్యూ ఇస్తారని ఆశిస్తున్నా. ఇవ్వకపోతే మీరు నిజాన్ని ఫేస్ చేయడానికి భయపడుతున్నట్లే కదా.'' అని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా వివేకా హత్య కేసుపై చర్చించడానికి చంద్రబాబును ఇంటర్వ్యూ అడిగారు. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


Tags:    

Similar News