చల్లటి కబురు.. రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు

నిన్నటి వరకు వడగాలులు, మండుటెండలతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు

Update: 2023-06-21 02:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నిన్నటి వరకు వడగాలులు, మండుటెండలతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు అనకాపల్లి, కృష్ణా జిల్లా, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ రైతులు నైరుతి రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు.కాగా, ఈరోజు రాత్రి లేదా, రేపు ఉదయం నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయని, వాతావరణ విభాగం తెలిపింది.

Also Read..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేనలో కలకలం 

Tags:    

Similar News