భారత్ గౌరవ్ రైలులో అయోధ్య వెళ్తారా.. ..టికెట్ రేట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే..!

అయోధ్యకు వెళ్లే భారత్ గౌరవ్ రైలు టికెట్ రేట్లను రైల్వే శాఖ ప్రకటించింది...

Update: 2024-05-22 14:28 GMT

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో రామమందిరం కొలువైన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుని శ్రీరాముని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజల కోసం దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ మీదుగా భారత్ గౌరవ్ రైలును నడపనుంది. ఈ రైలు నేపాల్, ముక్తినాథ్, దివ్వ దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో నడుస్తోంది. ఈ భారత్ రైలు జూన్ 7న తమిళనాడు రాష్ట్రం చెన్నై నుంచి బయలు దేరనుంది. మళ్లీ తిరిగి జూన్ 19న తిరుగు ప్రయాణం కానుంది. అయితే ఈ రైలు చెన్నై, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, ఖాజీపేట స్టేషన్ల మీదుగా ముక్తినాథ్, నైమిశారణ్యం, ఖాడ్మండు, పశుపతినాథ్, అయోధ్యకు చేరుకుంటుంది.

అయితే ఈ రైలు ప్రయాణం చేయాలంటే జేబు నిండా డబ్బులు ఉండాల్సిందే. ఈ రైలులో స్లీపర్ క్లాస్‌తో పాటు సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీలున్నాయి. జనరల్ బోగీలు లేవు. స్లీపర్ క్లాసులో ప్రయాణం చేయాలంటే ఒక్కో టికెట్ రూ. 45,900 చెల్లించాలి. థర్డ్ ఏసీలో రూ. 54, 900, సెకెండ్ క్లాస్‌లో రూ. 59,950గా టికెట్ రేట్ నిర్ణయించారు. ఈ క్లాస్‌ల్లో టీ, టిఫిన్, భోజనం, హోటల్ గదులు, రవాణాతో కలిపి ఈ చార్జీల్లోనే వసూలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య వెళ్లాలంటే వెంటనే 93550 21516 నెంబర్‌కు సంప్రదించి టికెట్ బుకింగ్, ప్రయాణ వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

Similar News