AP Elections 2024: ప్రొద్దుటూరు రాచ మార్గమా..? వరద అడ్డునా..?

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Update: 2024-04-14 13:00 GMT

దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కడపజిల్లాలోని ప్రొద్దుటూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. అసలే రాజకీయాల్లో ప్రొద్దుటూరుకు అరుదైన రికార్డు ఉంది. వరుసగా ఐదు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆధిపత్యం వహించిన ఘనత ప్రొద్దుటూరు సొంతం. ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు, టీడీపీ 3సార్లు, వైసీపీ రెండు సార్లు గెలుపొందింది.

అయితే రానున్న ఎన్నికల బరిలో వైసీపీ నుండి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉండగా.. ఆయనతో తలపడేందుకు టీడీపీ అభ్యర్థిగా కురువృద్ధుడు నంద్యాల వరదరాజులు రెడ్డి బరిలో దిగనున్నారు. కాగా గెలుపు నాదే అని రాచమల్లు, గెలిచేది నేనే అని వరద ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News