గుంటూరులో బరితెగించిన ప్రైవేటు ఆస్పత్రులు.. అవసరం లేకున్నా సిజేరియన్స్

గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రులు బరితెగించాయి...

Update: 2024-05-25 08:10 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రులు బరితెగించాయి. డబ్బులు కోసం కొందరు వైద్యులు వైద్య వృత్తికే చెడ్డ పేరు తెస్తున్నారు. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు. రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నారు. రోగుల ప్రాణాలకంటే డబ్బే పరమవధిగా భావిస్తున్నారు. ఇలా గుంటూరులో చాలా ఆస్పత్రుల్లో నిండు గర్భిణీలను మోసం చేస్తున్నారు. నార్మల్ డెలివరీ చేయకుండా డబ్బుల కోసం సిజేరియన్స్ చేస్తున్నారు. డీఎంహెచ్‌వో విజయలక్ష్మి తనిఖీల్లో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరులో 99 ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా సిజేరియన్లు చేశారు. ఒక్కో కాన్పుకు రూ. 70 వేల నుంచి లక్షకు పైగా బిల్లులు వసూలు చేశారు. దీంతో ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. అనవసరంగా సీజేరియన్ ఆపరేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  డీఎంహెచ్‌వో హెచ్చరించారు.

Similar News