తనిఖీలు మ్ముమ్మరం.. పల్నాడులో ప్రతి ఇంటిని జల్లెడపడుతున్న పోలీసులు

Update: 2024-05-19 11:07 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో ఎన్నికల పోలింగ్ వేళ, ఆ తర్వాత ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయి సిట్ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన సిట్ అధికారులు పల్నాడు జిల్లాలో జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి చోట తనిఖీలు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ నేతలు పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లు, బడిసెలు, మారణాయుధాలతో దాడులు చేసుకున్న నేపథ్యంలో వారి ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. దాడి ఘటనపై ఆరా తీస్తున్నారు. ఘర్షణ జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. అలర్లపై నమోదు చేసిన కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. దాడులకు సంబంధించి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుంటున్నారు.

‘అసలు ఏం జరిగింది. ఎందుకు అల్లర్లు చెలరేగాయి. ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు. బాంబు దాడుల చేసింది ఎవరు..?. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేసిందెవరు..?’ అని ఆరా తీస్తున్నారు. ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. కేసులు నమోదైన నేతలు ఎక్కడున్నారనే విషయాలపైనా స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజులు, వీడియోలు, ఫొటోలు ఆధారంగా కొత్త కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. 

Similar News