‘పిఠాపురం గడ్డ నా అడ్డ.. పవన్ కల్యా్ణ్ పోటీ చేసినా నేనే గెలుస్తా’

ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఆసక్తికర చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసిన పవన్.. రెండుచోట్లా ఓడిపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-03-05 12:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఆసక్తికర చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసిన పవన్.. రెండుచోట్లా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా పట్టున్న నియోజకవర్గంలోనే బరిలోకి దిగాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్లు, మేధావులు ఆయన్ను పిఠాపురం నుంచి పోటీ చేయాలని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారన్న వార్తలు విస్తృతం కావడంతో వైసీపీ మహిళా నాయకురాలు వంగా గీతా స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి వైసీపీ 175 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. పిఠాపురంలో అభ్యర్థి ఎవరైనా గెలుపు నాదే అని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పోటీ చేసినా ఓడిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు తమపై సంపూర్ణ నమ్మకం ఏర్పడిందని అన్నారు.

Tags:    

Similar News