రిగ్గింగ్ చేశారు కాబట్టే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు:వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రమంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో కొందరు పోలింగ్ బూత్ లో చేరి రచ్చ చేశారు

Update: 2024-05-22 14:04 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రమంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో కొందరు పోలింగ్ బూత్ లో చేరి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సీసీటీవీ పుటేజ్ ద్వారా బయటపడింది. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసి, తమ ఏజెంట్ల పై దాడి చేయడం వల్ల పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఏడు చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని అధికారులు చెబుతున్నారు. మరి పిన్నెల్లి వీడియో ఒకటే ఎందుకు బయటకు వచ్చింది అని ప్రశ్నించారు. మిగతా వీడియోలు రిలీజ్ చేయండి. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం. పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు.

Similar News