పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం..! టాలీవుడ్‌తో సహా ఆ ఇండస్ట్రీ నుంచి కూడా మద్దతు.. పోస్ట్‌లు వైరల్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల టెన్షన్ మొదలైంది.

Update: 2024-05-12 09:45 GMT

దిశ, సినిమా: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల టెన్షన్ మొదలైంది. ఓటింగ్ సమయం దగ్గరపడటంతో.. ఈ బరిలో గెలుపు ఎవరిదో, ఓటమీ ఎవరిదో తెలుసుకునేందుకు ప్రజలు ఈసారి ఎంతో ఉత్సహాంగా ఉన్నారు. అంతే కాకుండా తమ అభిమాన నాయకుడికి ఓటు వేసి గెలుపించుకునేందుకు ఇప్పటికే చాలా మంది తమ సొంత ఊర్లకు ప్రయాణం అయ్యారు. ఈ మేరకు ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పోటీ చాలా ఉత్కంఠగా మారింది.

రోజురోజుకు సినీ ఇండస్ట్రీ నుంచి ఆయనకు మద్దతు భారీగా పెరుగోతుంది. ఇప్పటికే సినీ సెలబ్రెటీలు, బుల్లితెర నటులు జనసేనాని పవన్ కల్యాణ్ కోసం రంగంలో దిగి సోషల్ మీడియాలో తమ మద్దతు తెలియజేస్తు్న్నారు. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పవన్ కల్యాణ్ కోసం ఇన్‌స్టా, X ఖాతాలో పోస్ట్‌లు పెడుతూ గెలిపించమని కోరుకున్నారు. ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా మద్దుతు వస్తుంది.

ఈ మేరకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్‌ పవన్‌కు సపోర్ట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలని కోరుకుంటున్నాను. మీ సేవ ప్రజలకు మరింత బలం చేకూర్చాలని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే సలార్ ఫేమ్ శ్రీయారెడ్డి కూడా తన మద్దతు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలుపుతూ.. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను. ఆయన కోరుకున్నది జరగాలని, పవన్‌కు విజయం దక్కాలని ఆశిస్తున్నాను’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో.. ఈసారి పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు.

Read More...

జనసేనకు మద్దతు తెలిపిన ప్రభాస్ ఫ్యామిలీ.. బొలిశెట్టి శ్రీనివాస్ రియాక్షన్ ఇదే (పోస్ట్) 

Tags:    

Similar News