అవన్నీ ప్రజలకు చెబుదాం సిద్ధం కండి.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

Update: 2024-02-15 14:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల బహిరంగ సభల నిర్వహణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల వారీగా ఇసుక దోచేస్తున్న వారి వివరాలను సిద్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ పాలకులకు ప్రజాక్షేమం, పాలన ఏనాడూ పట్టిలేదని అన్నారు. నాలుగేళ్లు కేవలం రాష్ట్ర వనరులను దోచుకోవడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారని ఆరోపించారు. ఏపీలో ఇసుక తవ్వకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు.

బహిరంగ సభల ద్వారా వైసీపీ దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో ప్రజలకు చెబుతామని సూచించారు. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభలతో సన్నద్ధం అవుతుంటే, టీడీపీ సంసిద్ధం అంటూ వరుస సభలను నిర్వహిస్తుంది. మరోవైపు నారా లోకేష్ శంఖారావం పేరుతో యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ సైతం వేగం పెంచడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News