పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలకు పన్నేండు రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా గణపవరం సభలో పాల్గొన్నారు.

Update: 2024-04-30 09:30 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు పన్నేండు రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా గణపవరం సభలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లలో పిల్లలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫొటో పెట్టడమేమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఐదేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్న వ్యక్తి బొమ్మ పుస్తకాలపై పెట్టడమేంటి? జగన్ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేశారు. పిల్లలకు ఇచ్చే చిక్కీ కవర్లపై రూ.67 కోట్ల కొట్టేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.

ఆయన హయాంలో పేకాట క్లబ్బులు, మద్యం , ఇసుక దోపిడీలే ఉన్నాయి. వైసీపీ ఓటమి తధ్యం అని అన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టగానే ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు పరిష్కారం చూపిస్తానని జనసేన అధినేత హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులకు భూముల పిచ్చి ఎక్కువైంది అన్నారు. ఊరురా మద్యం అమ్ముతున్న జగన్ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచి నీరివ్వడం లేదని ఫైర్ అయ్యారు. వైసీపీ గూండాలు మా కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోను. తెగించి కూర్చున్న..తాటాకు చప్పుళ్లకు భయపడను జగన్ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News