వెలుగులోకి పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి ఫోటోలు..ఎంతకు తెగించ్చార్రా

ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే చర్చకన్నా.. పవర్ స్టార్ నాలుగో పెళ్లి ముచ్చటే చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-03-03 12:56 GMT

దిశ డైనమిక్ బ్యూరో:  రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే చర్చకన్నా.. పవర్ స్టార్ నాలుగో పెళ్లి ముచ్చటే చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ఓపెన్  చేస్తే చాలు పవన్ నాలుగో పెళ్లి ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడ ఏ సభలో మాట్లాడిన పవన్ నాలుగు పెళ్లిళ్ల గురించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించే వారు.

ఇక జగన్ వ్యాఖ్యలకు పవన్ అభిమానులు స్పందిస్తూ పవన్ కి మూడు పెళ్లిళ్లు జరిగాయని.. నాలుగో పెళ్లి ఎప్పుడు జరిగిందని.. నాలుగో పెళ్ళాం జగన్ ఆ అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవ చేసేవాళ్ళు. అయితే అభిమానులు అనే మాటలు పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇటీవల జరిగిన ఓ భహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకి మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు మాత్రమే అయ్యాయి అని.. నాలుగో పెళ్ళాంగా నువ్వు రా జగన్ అని నోరు జారారు. అంతే అప్పటివరకు కామెంట్లకు మాత్రమే పరిమితమైన జగన్ వదిన అనే పిలుపు కాస్త పవన్ 4th వైఫ్ జగన్ అని తెలుపుతూ సోషల్ మీడియాలో ఫోటోలు మార్ఫింగ్ చేసే స్థాయికి వెళ్ళింది. తాజాగా విక్టరీ వెంకటేష్ అంజలి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని చివరి సీన్ ను పవన్ కళ్యాణ్ కు జగన్ కు ట్రోలర్లు అంకితం ఇచ్చేసారు.

పవన్ కళ్యాణ్ పక్కన జగన్ లేడీ గెటప్ ఫోటోను జతచేసి దానిపై నేను నా నాలుగో పెళ్ళాం వచ్చాం.. మా బావ గారి పేరు.. నా తోడికోడళ్ల పేరు..నా మొగుడి పేరు.. అయన నాలుగో పెళ్ళాం నా పేరు జగన్మోహిని.. నేను మా ఆయన వచ్చాం అని రాశారు. ఈ ఫన్నీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News