పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్..పిఠాపురంలో మారిన సీన్..అసలేం జరుగుతుందంటే?

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మే13వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-05-22 09:36 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మే13వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో దాదాపు 82 శాతం ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే.

ఈ క్రమంలో మరోసారి పిఠాపురం నుంచి జనసేనాని గురించి మరో టాపిక్ హల్ చల్ చేస్తోంది. అదే ఏంటంటే..గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్..ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి జనసేనాని చేయని ప్రయత్నం లేదు. పవన్ కల్యాణ్ కోసం సినీ నటులు సైతం ప్రచారం చేశారు. టీడీపీ శ్రేణులు కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీగా అని అంతా భావిస్తున్న క్రమంలో బిగ్ షాక్ ఎదురైంది. అయితే పిఠాపురంలో ఆయన గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పోలింగ్ తర్వాత రెండు రోజులు లక్ష మెజారిటీ అన్న జనసేన , టీడీపీ నేతలు ఇప్పుడు 10 నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది. బూత్‌ల వారిగా ఓట్ల లేక్కలు చూసిన తర్వాత పవన్ గెలిస్తే చాలు అనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్టు సమాచారం అందుతోంది. అధికార వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉండటంతో ఓట్లలో భారీగా చీలికలు వచ్చినట్లుగా సమాచారం. పిఠాపురంలో ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా పని చేసి ఉండటం, స్థానికురాలు కావడం వంగా గీతకు కలిసి వచ్చినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. మరి పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధిస్తారో లేదో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Similar News