వాళ్లను అడ్డుకుంటే స్వయంగా నేనే రోడ్డెక్కుతా: Pawan Kalyan

విజయవాడలో జనసేన దిమ్మె విషయంలో జనసేన, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది.

Update: 2022-09-03 10:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో జనసేన దిమ్మె విషయంలో జనసేన, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌‌ను అరెస్ట్ చేశారు. మహేష్ అరెస్ట్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ నేతల్లో ఓటమి భయం కనిపిస్తోందన్నారు. తమ కార్యకర్తలన్ని అడ్డుకుంటే స్వయంగా తానే రోడ్డు ఎక్కుతానని పవన్ హెచ్చరించారు. పోతిన మహేష్ అరెస్ట్‌ను ఖండిస్తున్నానని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జనసేనే బలమైన పార్టీ.. 119 పార్టీల్లో ఇదే టాప్

Tags:    

Similar News