భక్తురాలిపై పాస్టర్ అత్యాచారం.. శీలానికి ధర అధికార పార్టీ నాయకుడు

చర్చికి వస్తున్న ఓ భక్తురాలిపై పాస్టర్ కన్నేశాడు. ఇంట్లో పని ఉంది అని చెప్పి తీసుకెళ్లాడు.

Update: 2023-06-11 09:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : చర్చికి వస్తున్న ఓ భక్తురాలిపై పాస్టర్ కన్నేశాడు. ఇంట్లో పని ఉంది అని చెప్పి తీసుకెళ్లాడు. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో ఈ కేసు నుంచి బయటపడేందుకు పాస్టర్ ఓ అధికార పార్టీ నాయకుడిని కలిశాడు. దీంతో సదరు పెద్దమనిషి బాధిత మహిళ శీలానికి రూ.40వేలు కట్టి తప్పించుకున్నాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో జరిగింది.

ముదివర్తిపాలెంకు చెందిన ఓ వివాహిత చర్చికి వెళుతుండేది. దీంతో పాస్టర్ ఆమెపై కన్నేశాడు. ఆమెను ఎలాగోలా అనుభవించాలని కామంతో రగిలిపోయాడు. ఇటీవల మహిళ ప్రార్థన చేసుకునేందుకు ఒంటరిగా చర్చికి రాగా ఇదే సరయిన సమయం అని పాదర్ భావించాడు. ఇటీవలే తన ఇంట్లో పని ఉందని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు.

అయినప్పటికీ తనలా మరోకరు పాస్టర్ చేతిలో బలవ్వకూడదనే ఉద్దేశంతో బాధిత మహిళ తనపై జరిగిన అఘాయిత్యం గురించి భర్తకు, కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో బాధితురాలితో కలిసి కుటుంబ సభ్యులు ఈనెల 7న ఇందుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సదరు పాస్టర్ స్థానిక వైసీపీ నాయకుడిని ఆశ్రయించారు. దీంతో ఆ అధికార పార్టీ నాయకుడు రంగంలోకి దిగాడు. బాధిత మహిళ శీలానికి ఆ నాయకుడు వెల కట్టాడు. రూ.40వేలు ఇప్పిస్తా కేసును విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి పెంచారు. మరోవైపు ఇరు వర్గాలు రాజీ పడ్డారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ఘటనపై పోరాటం చేస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News