AP News:కూటమి అధికారంలోకి వస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి!

ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగాలని పేద బలహీన బడుగు వర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.

Update: 2024-05-07 13:04 GMT

దిశ ప్రతినిధి,అనకాపల్లి: ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగాలని పేద బలహీన బడుగు వర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన కూటమి నేతలు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవి పేటలో పర్యటించిన కొణతాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా, కమలం పువ్వు గుర్తు పై ఓటేసి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొణతాల విజ్ఞప్తి చేశారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని పేర్కొన్నారు. అధిక ధరలు, పన్నుల భారంతో ప్రజలు కృంగిపోతున్నారని తెలిపారు. నియంతృత్వ వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా ఎన్డీఏ కూటమి గెలిపించుకోవాలని కొణతాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Similar News